మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు పాకిస్తాన్‌ను 88 పరుగుల తేడాతో ఓడించింది.
మహిళా క్రికెట్‌లో పాకిస్తాన్ జట్టు భారత జట్టును ఆలౌట్ చేయడం ఇదే తొలిసారి.భారత్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోదిగిన పాకిస్తాన్ జట్టు 43 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది.పాకిస్తాన్ తరఫున సిద్రా అమీన్ 81 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు, చా ఘోష్ చేసిన 35 పరుగుల ఇన్నింగ్స్‌తో భారత్ 50 ఓవర్లలో 247 పరుగులు సాధించింది.భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ సమయంలో, కీటకాల కారణంగా ఆటను కొంతసేపు ఆపాల్సి వచ్చింది.
మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ స్కోరు 34 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 154 పరుగులు.మైదానంలో ఎగురుతున్న కీటకాలు, ప్లేయర్ల తలలపై తిరుగుతూ వారి కళ్ళలో పడుతుండడంతో బ్యాటింగ్, బౌలింగ్ రెండూ ఇబ్బందిగా మారాయి.
పాకిస్తాన్ ఆటగాళ్లు మైదానంలో పురుగుమందులు పిచికారీ చేశారు.248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ పేలవమైన ఆటతీరు కనబరిచింది. 11.1 ఓవర్లలో కేవలం 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.కానీ సిద్రా అమీన్, నటాలియా పర్వేజ్‌లు పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టడానికి ప్రయత్నించారు.
వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని క్రాంతి గౌడ్ బ్రేక్ చేసింది. నటాలియాను అవుట్ చేసింది.నటాలియా 33 పరుగుల వద్ద అవుటైంది. ఆ తర్వాత దీప్తి శర్మ పాకిస్తాన్ ఐదవ వికెట్‌ను తీసింది. ఫాతిమా సనా వేసిన బంతిని క్యాచ్ పట్టి, ఆమెను కేవలం రెండు పరుగులకే పెవిలియన్ దారి పట్టించింది.భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ విషయంలో కూడా వివాదం నెలకొంది.
టాస్ సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని సోషల్ మీడియాలో చాలామంది ప్రశ్నించారు. టాస్ సమయంలో ఫాతిమా సనాను అడిగినప్పుడు, ఆమె "టెయిల్స్" అని చెప్పింది.
కానీ అక్కడ ఉన్న మ్యాచ్ అధికారులు హెడ్స్ అని అన్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాణెం విసిరిన తర్వాత, హెడ్స్ పైకి రావడంతో, పాకిస్తాన్ టాస్ గెలిచిందిని ప్రకటించారు.కొలంబోలోని ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది.స్మృతి మంథాన, ప్రతికా రావల్ జంట భారత్‌కు శుభారంభాన్నిచ్చింది. అయితే, 9వ ఓవర్ చివరి బంతికి స్మృతి మంథాన (23) అవుట్ అయింది.
ప్రతికా రావల్ 23, హర్లీన్ దేవల్ 46 పరుగులు చేశారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా 19 పరుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్స్ 32 పరుగులు చేసింది.35 ఓవర్లలో భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆ తర్వాత దీప్తి శర్మ 25, స్నేహ్ రాణా 20 పరుగులు చేసి భారత్ స్కోరును 200 దాటించారు.
చివరగా, ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న రిచా ఘోష్ 20 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 పరుగులు చేసింది.ఆసియా కప్‌లో భారత, పాకిస్తాన్ క్రికెటర్ల మాదిరిగానే మహిళల ప్రపంచ కప్‌లో కూడా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ తీసుకోలేదు.టాస్ వేసే సమయంలో, మ్యాచ్ తర్వాత ఇరు జట్లు కరచాలనం చేసుకోలేదు.
భారత మహిళా జట్టు వన్డేల్లో పాకిస్తాన్ జట్టుపై ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. రెండు జట్లు ఇప్పటివరకు 12 సార్లు తలపడ్డాయి. ప్రతిసారీ భారత జట్టే విజయం సాధించింది.