కృష్ణా, గోదావరిని వదిలేసిన సర్కార్

- నీటిని ఒడిసిపట్టలేక చేతులు ఎత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
- పాలమూరు లిఫ్ట్ ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు
- మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
- మిడ్జిల్ మండలంలో ఎండి పోయిన పంటల పరిశీలన
మహబూబ్‌నగర్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మిడ్జిల్: కృష్ణా, గోదావరి నీటిని ఒడిసిపట్టలేక కాంగ్రెస్ సర్కార్ చేతుతెల్తేసిందని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి విమర్శించారు. అదే నీటిని సరైన పద్ధతిలో మళ్లించి ఉంటే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉండేదని, అసలు రాష్ట్రంలో కరువు ఏర్పడే పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి.. ‘కరెంట్ ఇవ్వలేం.. రైతులకు సాగునీరు ఇ వ్వలేం.. పంటలు వేసుకోకండి.. కరువు ను మరిచిపోయేందుకు గ్రామాల్లో నాటకాలు పెట్టించండి’ అని మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.
శనివారం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మంగలిగడ్డ తండా పరిధిలోని తులసీరాం నాయక్ తండాలో రైతు సోమ్లానాయక్‌కు చెందిన ఎండిన వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా సదరు రైతు మాట్లాడుతూ.. బోరులో నీళ్లున్నా కరెంట్ సక్రమంగా ఇవ్వకపోవడంతో లోవోల్టేజీ సమస్యతో పంట మొత్తం ఎండిపోయిందని ఆవేదన చెందాడు. సుమారు లక్ష రూపాయలకుగాపై పెట్టుబడి పెట్టినా పంట చేతికి రాలేదని ఆవేదన చెందాడు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడ చూసి నా పంటలు ఎండిపోతున్నాయని తెలిపా రు.
కృష్ణా, గోదావరి జలాలు వచ్చినయి వచ్చినట్టు నింపాలని బీఆర్‌ఎస్ ఆందోళన చేసినా రేవంత్ సర్కార్ పట్టించుకోలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 90 శాతం పూర్తి చేసి కాలువలకు టెండర్లను పిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ టెండర్లను పూర్తి చేసి ఉంటే ఇప్పుడు రైతులకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అ న్నారు. శ్రీశైలం నుంచి ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం కు కృష్ణా జలాలు తీసుకుపోతే 70 కి.మీ. దూరంలోని సొంత జిల్లాకు మాత్రం నీళ్లు తీసుకురావడంలో రేవంత్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
Comments (0)