రాజధానిలో భాగం కానున్న బెజవాడ శివారు ప్రాంతాలు.. ఎన్టీఆర్ జిల్లాలో స్పోర్ట్స్ సిటీకి భూ సమీకరణ.. ఏ గ్రామాల్లో అంటే…!
విజయవాడ-గుంటూరు నగరాల మధ్య కృష్ణా నది తీరంలో 34వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తోన్న అమరావతి నగరంలో ఇక విజయవాడ పరిసర ప్రాంతాలు కూడా భాగం కానున్నాయి. స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి అవసరమైన భూములు ఎన్టీఆర్ జిల్లాలో రైతుల నుంచి భూముల్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.