బడిలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ హెడ్‌మాస్టర్ : వీడియో

3 November 2026 - 19:29
0 0
బడిలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ హెడ్‌మాస్టర్ : వీడియో
Adb

ఆదిలాబాద్ : విద్యా బుద్ధులు నేర్పి పిల్ల‌ల‌కు ఆద‌ర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు త‌ప్పుదారి ప‌ట్టాడు. ఏకంగా పాఠ‌శాల‌లోనే మ‌ద్యం తాగుతూ ప‌ట్టుబ‌డ్డాడు. వివ‌రాల్లోకి వెళ్తే..ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గంభీరావుపేట ఎంపీయూపీఎస్ పాఠశాలలో హెడ్‌మాస్టర్ శ్రీనివాస్ మద్యం సేవించి స్కూలుకు వస్తున్నాడని విద్యార్థులు అధికారుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ మేర‌కు గ్రామ‌స్తులు హెడ్‌మాస్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Comments (0)

User