Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి

కారేపల్లి : ఈ నెల 15న ఖమ్మం పట్టణంలోని చెరుకూరి వారి మామిడి తోటలో నిర్వహించనున్న మున్నూరు కాపు (Munnuru Kapu ) కార్తీక మాస వన సమారాధన ( Vanasamaradhana ) కార్యక్రమానికి భారీగా తరలిరావాలని ఆ సంఘం ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు పగడాల మంజుల ( Pagadala Manjula ) పిలుపునిచ్చారు.మున్నూరు కాపు సంఘం సింగరేణి మండల కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు.
కులబాంధవుల మధ్య ఐక్యత,ఆత్మీయత,పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. వన సమారాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.అదే రోజు మధిర పట్టణంలో వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్నూరు కాపు సంఘం సింగరేణి మండల అధ్యక్షుడు గమిడి నరసింహారావు, ప్రధాన కార్యదర్శి ముత్యాల సురేష్, కోశాధికారి వాకాటి సురేష్, నాయకులు కడియాల సుధాకర్, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Comments (0)