Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు

క్రాకోవ్: పోలాండ్‌లో ఓ ఉన్మాది కాల్పులకు తెగించాడు. క్రాకోవ్(Krakow Shooting) నగరంలో ఈ ఘటన జరిగింది. సిటీ సెంటర్‌లోకి గన్‌తో వచ్చిన అతను తన కారు నుంచి జనంపైకి ఫైరింగ్ చేశాడు. సాయుధుడు చేసిన దాడిలో ఆరుగురు మృతిచెందారు. ఓ బ్రిటీష్ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ముగ్గురు పోలాండ్ స్థానికులు ఉన్నారు. మరో ఇద్దర్ని గుర్తించాల్సి ఉన్నది. ఉన్మాది కాల్పుల్లో మొత్తం 16 మంది గాయపడ్డారు. బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రియా, పోర్చుగల్, రష్యాకు చెందిన దేశీయులు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తిని 25 ఏళ్లు ఉంటాడని భావిస్తున్నారు. మిలిటరీ తరహా దుస్తుల్లో వచ్చిన అతను దాడికి పాల్పడ్డాడు.
అటాక్ కోసం మిలిటరీ వెపన్ వాడినట్లు తెలుస్తోంది. తన వాహనంలో మరిన్ని ఆయుధాలు ఉన్నట్లు గుర్తించారు. అనుమానితుడిది రేడికల్ భావజాలం ఉన్నట్లు తెలుస్తోంది. అతివాద ఐడియాలజీతో అతను ప్రేరణ పొందినట్లు పోలాండ్ మంత్రి ఒకరు తెలిపారు. అనుమానితుడి ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు పోలాండ్ ప్రధాని డోనాల్డ్ టస్క్ చెప్పారు. అతని రూమ్‌లో మరో ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. ఆ మృతులు అతని ఫ్యామిలీ సభ్యులే అని పోలీసులు భావిస్తున్నారు. పోలాండ్‌లో సామూహిక కాల్పుల ఘటనలు జరగడం అత్యంత అరుదు. కానీ క్రాకోవ్‌లోని మెయిన్ మార్కెట్ స్క్వేర్‌లో ఆ ఘటన జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Comments (0)