అనంతపురం జిల్లా రాప్తాడులో పరిటాల శ్రీరామ్ పూర్తి ప్రసంగం

8 November 2026 - 01:39
0 3

కదిరి నియోజకవర్గం నల్లచెరువు జడ్పీటీసీ అభ్యర్థిగా శ్రీరామ్ నామినేషన్ సత్యసాయి జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ సమర్పణ నిరాడంబరంగా నామినేషన్ ప్రక్రియ పూర్తి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ, తెలుగుదేశం పార్టీ నేత పరిటాల శ్రీరామ్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఎలాంటి హడావుడి లేకుండా నిరాడంబరంగా ఈ ప్రక్రియ పూర్తి చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన శుక్రవారం, పరిటాల శ్రీరామ్ కొత్తచెరువులోని శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.ఎస్. రాజు ఉన్నారు. కదిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నల్లచెరువు నుంచి ఆయన పోటీకి దిగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకునే వ్యూహంలో భాగంగానే, టీడీపీ అధిష్ఠానం పరిటాల శ్రీరామ్‌ను జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దించినట్లు తెలుస్తోంది. జిల్లా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా ఆయనే ఉంటారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. 

Comments (0)

User