Singapore haze | సింగ‌పూర్‌లో 15 రోజులుగా ద‌ట్ట‌మైన పొగ‌మంచు.. అనారోగ్య‌క‌ర స్థాయిలో గాలి నాణ్య‌త‌..!

19 October 2026 - 22:15
0 0
Singapore haze | సింగ‌పూర్‌లో 15 రోజులుగా ద‌ట్ట‌మైన పొగ‌మంచు.. అనారోగ్య‌క‌ర స్థాయిలో గాలి నాణ్య‌త‌..!
Fog

Singapore haze : సింగపూర్ (Singapore) దేశాన్ని గ‌డిచిన‌ 14 రోజులుగా పొగమంచు (Fog) సమస్య ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. అక్టోబర్ 5 నుంచి అక్క‌డ పొగ‌మంచు క‌మ్ముకుంది. గాలి నాణ్యత అనారోగ్యకర స్థాయిలో ఉన్న‌ద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం నివేదికలు స్ఫ‌ష్టం చేస్తున్నాయి. అయితే ఈ కాలుష్యానికిగల కారణాలను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సింగపూర్ జాతీయ పర్యావరణ సంస్థ తెలిపింది.

ఈ పొగ‌మంచు ప్రభావం పర్యాటకం, బహిరంగ భోజనశాలలు, నిర్మాణం, విమానయానం వంటి ప‌లు రంగాలపై పడినట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. పరిస్థితులు మరింత దిగజారితే విద్యార్థుల‌కు ఆన్‌లైన్ బోధనను ప్రవేశపెట్టాలని సింగపూర్ విద్యా శాఖ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే కాలానుగుణంగా మారే గాలులవల్ల పరిస్థితులు మెరుగుపడే అవకా శం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Comments (0)

User