Screwworm: మాంసం తినే స్క్రూవర్మ్.. తొలిసారి మనిషి శరీరంలో గుర్తించిన వైద్యులు..!

న్యూ వరల్డ్ స్క్రూవర్మ్ (ఎన్‌డబ్ల్యూఎస్) మైయాసిస్‌ను ఎల్ సాల్వడార్ నుంచి అమెరికాకు వచ్చిన ఒక రోగి శరీరంలో కనుగొన్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (హెచ్‌హెచ్‌ఎస్) ఆగస్టు 25న వెల్లడించింది.
మాంసం తినే స్క్రూవర్మ్ అనే పరాన్నజీవి తొలిసారిగా మానవ శరీరంలో బయటపడింది. అమెరికాలో ఇది నిర్ధరణ అయినట్లు అధికారులు చెప్పారు.ఈ రోగం ప్రధానంగా పశువులకు వ్యాపిస్తుంది.
కానీ తొలిసారిగా మానవ శరీరంలో ఈ పరాన్నజీవులు కనిపించాయి.అయితే ప్రస్తుతానికి అమెరికాలో ప్రజారోగ్యానికి ప్రమాదం 'చాలా తక్కువ'గా ఉందని అధికారులు తెలిపారు.ఎన్‌డబ్ల్యూఎస్ మైయాసిస్‌కు సంబంధించిన మనుషుల్లో తొలి కేసు ఇదేనని హెచ్‌హెచ్‌ఎస్ ప్రతినిధి అండ్రూ నిక్సన్ చెప్పారు.
సజీవ కణజాలాన్ని తినే ఈ వినాశకరమైన పరాన్నజీవి సాధారణంగా దక్షిణ అమెరికా, కరేబియన్ ప్రాంతాలలో కనిపిస్తుంది.ఇది వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ మెక్సికో సహా ప్రతి సెంట్రల్ అమెరికా దేశంలోనూ ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.