Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్‌కే అద్వానీ !

ముంబై: లాల్ కృష్ణ అద్వానీ .. వందేళ్ల ప్రాయంలోకి ఎంటర్ అయ్యారు. నవంబర్ 8వ తేదీన .. దీపావళి శుభవేళ .. ఆయన నూరవ సంవత్సరంలోకి ప్రవేశించారు. ఆధునిక భారతంలో వందేళ్లు జీవించిన వ్యక్తులు చాలా అరుదు. 1927, నవంబర్ 8వ తేదీన అద్వానీ జన్మించారు. ఆ రోజు కూడా దీపావళి కావడం విశేషం. 1947లో దేశవిభజన సమయంలో ఆయన సింధ్ ప్రాంతాన్ని వీడారు. తొలుత జన సంఘ్‌ను, ఆ తర్వాత బీజేపీ పార్టీలను బలోపేతం చేశారాయన. బీజేపీ అధ్యక్షుడిగా అద్వానీ ఉన్న సమయంలోనే.. కాంగ్రెస్ ఆధిపత్యం తగ్గింది. 1989లో కాంగ్రెస్ పార్టీ బలం 400 నుంచి 200కు పడిపోయింది. 1996లో బీజేపీయే ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. అనేక తరాలకు చెందిన కార్యకర్తలను ఆయన తయారు చేశారు. దేశమే మొదలు ఉన్న సిద్ధాంతంతో ఆయన పార్టీకి ఫౌండేషన్ వేశారు.
అద్వానీలో రెండు ముఖ్యమైన గుణాలున్నాయి. సిద్ధాంతపరంగా ఆయన చాలా క్లియర్. ఆయన బుద్ధిలోనూ చాలా చురుకైన వ్యక్తి. ఆయన ప్రసంగాలు, రాతల్లో ఈ అంశాలు స్పష్టంగా కనిపించేవి. జన సంఘ్, బీజేపీ చేసిన అనేక తీర్మానాలను ఆయనే రాశారు. ఇక సూడో సెక్క్యులరిజంను ఆయన చాలా చాకచక్యంగా బహిరత్గం చేశారు. అద్వానీ ప్రతి బాధ్యతను సమదృష్టితో నిర్వర్తించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా తొలుత రాజస్థాన్‌లోని వేర్వురు ప్రదేశాల్లో పనిచేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లారు. అటల్‌జీతో కలిసి చేశారు. అక్కడే ఆ ఇద్దరూ కొన్ని దశాబ్ధాలు కలిసి ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. పోటీతత్వంతో కాకుండా.. సహకారంతో పనిచేశారు. భారత రాజకీయాల్లో ఆ ఇద్దరూ ప్రత్యేక సవాళ్లు విసిరారు.
దేశ విభజనను ప్రత్యక్షంగా అనుభవించిన అద్వానీ.. జన సంఘ్‌ను దృఢంగా మార్చారు. 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ చైర్మెన్ అయ్యారు. ఆ సమయంలో విజయ్ కుమార్ మల్హోత్రాతో కలిసి పనిచేశారు. 1970 దశకంలో ఆయన పార్లమెంటరీ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఎంపీగా ప్రత్యేకత సంపాదించుకున్నారు. ఆ తర్వాత విపక్ష నేతగా రెండు సభల్లోనూ ప్రశంసలు పొందారు. ఎంపీగా కొనసాగుతూనే ఆయన ఇండియా మొత్తం టూరు చేశారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి ఆయన పోటీ చేశారు. గుజరాత్ నుంచి ఆయన పలు మార్లు రాజ్యసభ ఎంపీగా కూడా నియమితుడయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో అద్వానీ కీలక పోరాటం చేశారు. ఏ ప్రిజనర్స్ స్క్రాప్ బుక్ అనే పుస్తకం రాశారు. దాంట్లో ఇండియా, జర్మనీలో ఏర్పడిన ఎమర్జెన్సీ పరిస్థితులను పోల్చుతూ ప్రస్తావించారు.
అద్వానీ శక్తివంతమైన విపక్ష నేతగా పని చేశారు. అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అని కూడా అనిపించుకున్నారు. 1977లో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు .. అద్వానీ సమాచార, ప్రసార శాఖ బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ ప్రధానిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా చేశారు. భద్రతా దళాలను బలోపేతం చేయడంలో అద్వానీ పాత్ర శ్లాఘనీయం. ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను రూపొందించారు. అయితే సోమనాథ్ నుంచి అయోధ్యకు చేపట్టిన రథయాత్ర .. అద్వానీ జీవితంలో ఓ విశేషమైన ఘట్టం. ఆ యాత్ర సమయంలో ఆయన్ను బీహార్‌లో అరెస్టు చేశారు. కానీ ఆయన కల కన్నట్లే అయోధ్యలో ఇప్పుడు భారీ రామమందిర నిర్మాణం జరిగింది.
అనేక సందర్భాల్లో ఆయన సాధారణ కార్యకర్తగా పనిచేశారు. వార్తాపత్రికలను నిశితంగా చదివేవారు. సినిమాలు, నాటకాలు అంటే ఆయనకు అభిమానం. సినిమాలను విమర్శించడంలో అద్వానీ దిట్ట. పాక్‌లోని సింధ్ నుంచి వచ్చిన అద్వానీ ఆ కల్చర్‌ను వీడలేదు. లేహ్‌లో సింధూ దర్శన్ పూజాను ఆయన పాపులరైజ్ చేశారు. ఎల్‌కే అద్వానీకి.. నిత్య ప్రేరణగా, శక్తిగా, సపోర్టుగా కమలా అద్వానీ నిలిచారు. చిన్నతనంలో ఆయన కరాచీలో పెరిగారు. 2024లో అద్వానీని భారత రత్నతో సత్కరించారు. 100వ పడిలోకి ఎంటరైన సందర్భంగా అద్వానీకి బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
Comments (0)