Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో

Fire Accident | దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాల్చేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటారని తెలిసిందే. అయితే పటాకాయలు కాల్చేటపుడు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదాలు జరుగుతుంటాయి. సికింద్రాబాద్ పరిధిలో దీపావళి సంబురాలు భారీ అగ్ని ప్రమాదానికి కారణమయ్యాయి.
సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్‌మండిలో దీపావళికి అంటించిన ఓ రాకెట్ బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా షాపులోని క్రాకర్స్ అన్నీ పేలి, మంటలు భారీగా ఎగసిపడ్డాయి. మంటలు రావడంతో జనాలు, వాహనాలు భయంతో పరుగులు పెట్టారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదంలో జరిగిన నష్టానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీ అగ్నిప్రమాదం
సికింద్రాబాద్ సీతాఫల్మండిలోని బాణసంచా దుకాణంలోకి రాకెట్ దూసుకెళ్లడంతో షాపులోని క్రాకర్స్ అన్నీ పేలి, ఎగసిపడ్డ మంటలు
ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది https://t.co/EIp1Pu6AmN
— Telugu Scribe (@TeluguScribe) November 8, 2026
Read Also :
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Comments (0)