KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం

26 October 2026 - 12:08
0 0
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
Ktr

KTR | రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 25 (నమస్తేతెలంగాణ)/ గంభీరావుపేట: తెలంగాణ తన గోత్రమని, సిరిసిల్ల నా కులమని, రాజకీయ భిక్ష పెట్టిన సిరిసిల్ల ప్రజలను ఏనాటికి మరువబోనని, మీరిచ్చిన ఆశీర్వాదం.. కేసీఆర్ ప్రోత్సాహంతోనే ఇంతదాక వచ్చానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. మంచిచేయడం తప్పా ఎవరికీ హాని తలపెట్టడం తనకు తెలియదని చెప్పారు.

రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఐదువందల ఏళ్లయినా ఆయనను ఎవరూ మరిచిపోరని పేర్కొన్నారు. ఆయన కొడుకుగా ఎంతో గర్వపడుతున్నా నని స్పష్టంచేశారు. పార్టీ అప్పగించిన బాధ్యతల్లో మునిగితేలుతూ సిరిసిల్లకు రావడం కొంత మేర తగ్గిందని, నియోజకవర్గ ప్రజలు పెద్దమనుసుతో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో గంభీరావుపేట మండలం శ్రీగాధ గ్రామస్తులు కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీగాధ వాసులతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. మీ అవతలివైపు మా నానమ్మ ఊరు పోచంపల్లి ఉండేదని, ఎగువ మానేరులో మునిగి పోయిందని గుర్తుచేసుకున్నారు. ఇప్పటికీ శ్రీగాధలో మా ఇంటిపేరు కలిగిన వారు ఉన్నారని చెప్పారు.

మీరే నన్ను కాపాడుకోవాలి

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలతో కొంత బిజీగా ఉండి సిరిసిల్లకు రాలేక పోతున్నానని చెప్పారు. కానీ తనకు అవకాశం ఉన్నప్పుడు సిరిసిల్లకు చేయా ల్సిన అభివృద్ధిని చేశానని పేర్కొన్నారు. బీబీపేట నుంచి మీ ఊరికి రోడ్డు వేసిన విషయాన్ని ప్రస్తావించారు. మండుటెండల్లోనూ ఎగువమానేరును మత్తడి దూకించామని పేర్కొన్నారు. ‘అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని తాను కాపా డానని.. ఇప్పుడు నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నదని పునరుద్ఘా టించారు. 2029లో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్లను రాష్ట్రం లోనే నంబర్ వన్గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు.

సీఎం రేవంత్ తీరు హాస్యాస్పదం

మొన్న సిరిసిల్లకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రవర్తించిన తీరు విచి త్రంగా ఉన్నదని విమర్శించారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్లకు నిధులన్నీ తీసుకుపోతు న్నారని.. అక్కడ మాత్రమే అభివృద్ధి చేశారని గగ్గోలు పెట్టారు. ఇప్పుడేమో ఏమీ చేయ లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇంతకీ ఆయన రామునా..? రేమోనా ..? అర్థం కావడం లేదంటూ తనదైన శైలిలో వ్యంగ్యా స్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు అరిగోసపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. యూరియా అందక, రైతుబంధు రాక ఇక్కట్ల పాలవుతు న్నారని వాపోయారు. కరెంట్ కొరతతో పంటలు ఎండిపోతున్నాయని, ఈ దుస్థి తికి కారణం కరువు కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్సేనని దుయ్యబట్టారు.

కల్పతరువు 77 కాళేశ్వరం

ప్రస్తుత కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం కల్పతరువు అని కేటీఆర్ అభివర్ణిం చారు. కానీ కేసీఆర్పై కక్షతో రేవంత్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పడావుబెట్టి ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని వాపోయారు. కన్నె పల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయకపోవ డంతో ఏపీకి నీళ్లు తరలిపోయాయని ఆరోపించారు. 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి చంద్రబాబు నీళ్లు తీసుకెళ్తుంటే..మన ముఖ్యమం త్రికి మాత్రం 70 కిలో మీటర్ల దూరం లోని తన సొంత జిల్లాకు నీరందిం చడం చేతగావడంలేదని దెప్పిపొడి చారు. ఇప్పటికైనా సర్కారు మొద్దుని ద్రలేచి ప్రజలను కరువుబారి నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పోరాట కార్యాచ రణ ప్రకటిస్తుందని హెచ్చరించారు.

Comments (0)

User