KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు

19 October 2026 - 22:15
0 0
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Kcr

KCR | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిలో, సాంప్రదాయ వేడుకల్లో దసరా పండుగకి ప్రత్యేక స్థానం ఉన్నదని కేసీఆర్ అన్నారు.

విజయానికి సంకేతంగా నిలిచిన జమ్మి వృక్షానికి పూజ చేయడం, శుభానికి సూచికగా పాలపిట్టను దర్శించుకోవడం, అలయ్ బలయ్ తో పరస్పరం ప్రేమాభిమానాలను చాటుకోవడం, పవిత్ర మైన జమ్మి ఆకును బంగారంగా భావించి పంచుకోవడం, పెద్దల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకునే మహోన్నత సంస్కృతి సంప్రదాయాన్ని దసరా పండుగ మనకందిస్తున్నదని కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ ప్రజా జీవితాల్లో దసరా పండుగకున్న ప్రత్యేక తను విశిష్టతను గౌరవిస్తూ, జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా, పాలపిట్టను రాష్ట్ర పక్షిగా, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు.

ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మానిదే చివరి విజయమనే విజయ దశమి స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లోనూ, అనంతర పదేండ్ల ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి ఉన్నదని తెలిపారు. భవిష్యత్తులోనూ దసరా స్ఫూర్తి తో ప్రజలు కొనసాగుతున్న అధర్మం మీద విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

సామాన్య ప్రజలను అన్ని రంగాల్లో విజేతలుగా నిలబెట్టడం ద్వారానే దసరా పండుగ స్ఫూర్తిని అమలు పరిచిన వారమౌతామని కేసీఆర్ స్పష్టం చేశారు. కొనసాగుతున్న కష్టాలను తొలగించి, తెలంగాణ ప్రజా జీవితాల్లో దసరా పండుగ, శుభాలను, సుఖ సంతోషాలను తీసుకురావాలని కేసీఆర్ ప్రార్థించారు.

Comments (0)

User