India- USA Relationship : 1998 అణు పరీక్షల సమయంలో వాజపేయీ విదేశాంగ విధానం ఎలా ఉండేది..?

భారత విధానాలను అమెరికా ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు.1998లో అణు పరీక్షలు నిర్వహించినప్పుడు భారత్‌పై అమెరికా అనేక ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకం విధించినప్పుడు.. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయకుండా భారత్‌పై ఒత్తిడి పెంచడమే దీని లక్ష్యం అన్న విశ్లేషణలు వినిపించాయి."రష్యా చమురును కొనుగోలు చేయడం ద్వారా వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ యంత్రాంగానికి భారత్ ఇంధనం నింపుతోంది" అని కూడా అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ అన్నారు.
"మిగిలిన అణు పరీక్షలు మరుసటి రోజు మధ్యాహ్నం పూర్తయ్యేవరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ప్రధాన మంత్రి కార్యాలయం భారత రాయబారి నరేశ్ చంద్రకు తెలిపింది".
చాలా రోజుల పాటు సాగిన తెరవెనుక దౌత్యం, జస్వంత్ సింగ్, స్ట్రోవ్ టాల్బోట్ మధ్య అనేక సమావేశాల తర్వాత, అమెరికాను తన వైపు తిప్పుకోవడంలో భారత్ విజయం సాధించింది."వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి క్లింటన్ బెదిరింపు సందేశం పంపించారు, 'నేను బెర్లిన్ వెళ్తున్నాను.
అక్కడికి చేరుకోవడానికి నాకు ఆరు గంటలు పడుతుంది. అప్పటికి భారత ప్రభుత్వం బేషరతుగా సీటీబీటీపై సంతకం చేస్తే, దానిపై నేను ఎలాంటి ఆంక్షలు విధించను' అని క్లింటన్ అన్నట్టు భారత అణు కార్యక్రమంతో సంబంధం ఉన్న దౌత్యవేత్త టి.పి. శ్రీనివాసన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
2003లో హోలీ సందర్భంగా, అటల్ బిహారీ వాజపేయీ తన నివాసం 7 రేస్ కోర్స్ రోడ్‌లోని లాన్‌లో ఉన్నప్పుడు, మంత్రులు, శ్రేయోభిలాషులంతా ఆయన చుట్టూ చేరారు.
ఎవరో ఆయనకు తలపాగా పెట్టారు. విదేశాంగ మంత్రి యశ్వంత్ సిన్హా, అన్ని ఫార్మాలిటీస్‌ను పక్కన పెట్టి హోలీ పాట పాడటం ప్రారంభించారు.
అక్కడున్నవారి కోరిక మేరకు వాజపేయీ కూడా కాళ్లు, చేతులు కదుపుతూ నృత్యం చేయడానికి ప్రయత్నించారు.
ప్రధానమంత్రిగా ఆయన ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
అభిషేక్ చౌధురి ఇటీవల ప్రచురించిన అటల్ బిహారీ వాజపేయీ జీవిత చరిత్ర 'బిలీవర్స్ డైలమా'లో ఇలా రాశారు.
"వాజపేయీ కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలని కోరుకున్నారు, కానీ ఇరాక్‌పై అమెరికా దాడి చేసే అవకాశం ఉండటంతో ఇందులో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఇరాక్ సామూహిక విధ్వంసక ఆయుధాల ముప్పు నుంచి తన దేశాన్ని రక్షించుకోవాలని అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ కోరుకున్నారు. తాలిబన్లను అధికారం నుంచి తొలగించడం సరిపోదు. ఇస్లామిక్ తీవ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలనే అమెరికా లక్ష్యాన్ని ఇది పూర్తిగా తీర్చలేదు" అని మాజీ విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిసింజర్ నిర్మొహమాటంగా చెప్పారు.
అయితే, ప్రపంచంలోని అనేక దేశాలు దీనిని వ్యర్థమైన యుద్ధంగా భావించాయి, దీనికి ఎలాంటి సమర్థన దొరకలేదు.
"ఈ యుద్ధం వల్ల భారతదేశం లాభం కంటే ఎక్కువ నష్టపోబోతోంది, ఎందుకంటే భారతదేశం పూర్తిగా గల్ఫ్ చమురుపై ఆధారపడి ఉంది. ఎన్నికల సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరగడం ఏ ప్రభుత్వానికైనా చెడ్డ వార్త" అని అభిషేక్ చౌధురి రాశారు.ఐక్యరాజ్యసమితి పరిశీలకులు ఇరాక్‌లోని 300 ప్రదేశాలను తనిఖీ చేశారు. కానీ సామూహిక విధ్వంసక ఆయుధాలకు సంబంధించిన ఆధారాలు ఏవీ దొరకలేదు. అయినప్పటికీ, బుష్ వెనక్కి తగ్గలేదు."ఈ యుద్ధం వల్ల భారతదేశం లాభం కంటే ఎక్కువ నష్టపోబోతోంది, ఎందుకంటే భారతదేశం పూర్తిగా గల్ఫ్ చమురుపై ఆధారపడి ఉంది. ఎన్నికల సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరగడం ఏ ప్రభుత్వానికైనా చెడ్డ వార్త" అని అభిషేక్ చౌధురి రాశారు.
"ఈ సంక్షోభం ప్రభావం వల్ల చమురు రంగం వ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని ప్రభుత్వం గ్రహించింది. ఈ కారణంగానే హిందూస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కంపెనీల ప్రైవేటీకరణ నిలిపివేసింది. గల్ఫ్‌లో పనిచేస్తున్న 40 లక్షల మంది భారతీయులను సురక్షితంగా తీసుకురావడం గురించి ప్రభుత్వం ఆందోళన చెందడం ప్రారంభించింది"
"గుజరాత్ అల్లర్ల తర్వాత, భారత్‌లో నివసిస్తున్న ముస్లింలు బాగ్దాద్‌ను అమెరికా ఆక్రమించడాన్ని తీవ్రంగా, బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు" అని రాశారు.మార్చి 17 నాటికి ఇరాక్ తన వద్ద ఉన్న అన్ని సామూహిక విధ్వంసక ఆయుధాలన్నీ అప్పగించాలని డిమాండ్ చేస్తూ భద్రతా మండలిలో అమెరికా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.'ఏ దేశంలోనైనా పాలనను మార్చడానికి ఒక అగ్రరాజ్యం బలప్రయోగం చేయడం తప్పు. దానిని సమర్థించలేం' అని స్పష్టంగా చెప్పమని భారత పార్లమెంటులో ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది.
ఆ తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ "ఇరాక్‌లో జరుగుతున్న సైనిక చర్యను సమర్థించలేం" అని పేర్కొంది.
తర్వాత రోజు, వాజపేయీకి బుష్ ఫోన్ చేసి భారత్ నిరసనను కొంచెం తగ్గించమని అభ్యర్థించారు.
మాజీ విదేశాంగ మంత్రి యశ్వంత్ సిన్హా తన ఆత్మకథ 'రెలెంట్‌లెస్'లో ఇలా రాశారు.
''ఇరాక్‌పై అమెరికా దాడి చేసినప్పుడు భారత్‌లో పార్లమెంట్ సమావేశం జరుగుతోంది. తాను అమెరికా వ్యతిరేకని ప్రపంచానికి చూపించాలని కాంగ్రెస్ అనుకుంది. అమెరికా చర్యను పార్లమెంటు ఖండించాలని, లేకుంటే సమావేశాలు సాగనివ్వబోమని పట్టుబట్టింది''
"వ్యక్తిగతంగా, నేను ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాను. అంటే ఇరాక్‌లో అమెరికా చర్యకు నేను మద్దతు ఇస్తున్నానని కాదు, కానీ పార్లమెంటు ప్రతిపాదన ప్రభుత్వ విధానంలో సౌలభ్యాన్ని పరిమితం చేస్తుందని నేను భయపడుతున్నాను”.భారత్-అమెరికా సంబంధాలలో మరో ఇబ్బంది తలెత్తింది.
అప్పటి జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్ మిశ్రా వాషింగ్టన్ పర్యటన సందర్భంగా.. యుద్ధం తర్వాత పంపే స్థిరీకరణ బలగాల కోసం భారత సైన్యాన్ని పంపాలని అమెరికా కోరింది.
మిశ్రా దీనికి అనుకూలంగా ఉన్నారు. అంతకుముందు, మిశ్రా 'ఇస్లామిక్ ఉగ్రవాదం'పై పోరాడటానికి భారతదేశం-అమెరికా-ఇజ్రాయెల్ కూటమిని సమర్థించారు.
జూన్ 2003లో అమెరికా పర్యటన సందర్భంగా, అమెరికా ఉపాధ్యక్షుడితో జరిగిన సమావేశంలో ఎల్.కె. అడ్వాణీ కూడా దళాలను పంపడానికి భారతదేశం సుముఖంగా ఉందన్న సంకేతాలిచ్చారు.
నిజానికి, ఈ శాంతి దళంలో భారత్, పాకిస్తాన్ రెండూ తమ సైనికులను పంపాలని అమెరికా కోరింది. ఉత్తర ఇరాక్‌లో పరిపాలన నిర్వహణకు భారత్ తన విభాగాల్లో ఒకదాన్ని పంపాలని అమెరికా ప్రత్యేకంగా కోరింది.