Hansika | హన్సిక పేరుతో ప్రైవేట్ వీడియో కలకలం.. డీప్‌ఫేక్ ప్రచారంపై అసలు నిజం ఇదే!

30 October 2026 - 14:28
0 0
Hansika | హన్సిక పేరుతో ప్రైవేట్ వీడియో కలకలం.. డీప్‌ఫేక్ ప్రచారంపై అసలు నిజం ఇదే!
Hansika

Hansika | ఏఐ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత నిజమైన వీడియో ఏది? మార్ఫింగ్ చేసిన వీడియో ఏది? అనేది గుర్తించడం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా సినీ తారలు ఈ డీప్‌ఫేక్ వీడియోల బారిన పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు వ్యక్తులు ఇతరుల వీడియోలకు హీరోయిన్ల ముఖాలను జతచేసి, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ లైకుల‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు నటీమణులు ఇలాంటి ఘటనలపై ఆందోళన వ్యక్తం చేయగా.. తాజాగా ఈ జాబితాలో నటి హన్సిక మోత్వాని పేరు కూడా వినిపిస్తోంది.గత రెండు రోజులుగా హన్సికకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో బయటకు వచ్చిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా రెడ్డిట్, ఎక్స్ వేదికలపై ఈ అంశంపై పలువురు పోస్టులు పెట్టడంతో చర్చ మొదలైంది. కొందరు మీమ్స్, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే చిత్రాలను జతచేస్తూ పోస్టులు చేయడంతో ఈ విషయం మరింత వైరల్‌గా మారింది. అయితే హన్సికకు సంబంధించిన వీడియో నిజంగా లీక్ అయిందనే విషయానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ ప్రచారాన్ని కొందరు నెటిజన్లు ఖండిస్తూ, వైరల్ అవుతున్నది డీప్‌ఫేక్ లేదా మార్ఫింగ్ చేసిన కంటెంట్ అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. సరైన ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని మరికొందరు సూచిస్తున్నారు. గతంలోనూ పలువురు నటీమణుల పేర్లతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరిగిన నేపథ్యంలో ఈసారి కూడా వాస్తవాలు తెలుసుకోకుండా వీడియోలను షేర్ చేయవద్దనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు హన్సిక వ్యక్తిగత జీవితం కూడా గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. 2022లో వ్యాపారవేత్త సోహైల్ కతురియాను ఆమె వివాహం చేసుకున్నారు. వీరిద్దరి వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. అంతేకాకుండా ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన దృశ్యాలు ఓటీటీలో డాక్యుమెంటరీ రూపంలో ప్రసారమయ్యాయి. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా 2026లో ఈ జంట విడిపోయినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం హన్సిక సినిమాల విషయంలోనూ పెద్దగా సందడి చేయడం లేదు. ఇలాంటి సమయంలో ఆమె పేరుతో ప్రైవేట్ వీడియో లీక్ అయిందంటూ జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వైరల్ వార్తలపై హన్సిక ఇప్పటివరకు స్పందించలేదు. ఆమె నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందా? ఈ ప్రచారం వెనుక అసలు నిజం ఏమిటి? అనేది తెలియాల్సి ఉంది.

Comments (0)

User