Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ

19 October 2026 - 22:15
0 0
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Dasoju Sravan

Dasoju Sravan | తెలంగాణలో నెలకొన్న తీవ్ర కరువు, ఎల్‌నినో పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం కాదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం, నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన మానవ తప్పిదమేనని మండిపడ్డారు.

ఎల్‌నినో, కరువు పరిస్థితులపై వాతావరణ శాఖ ఏప్రిల్‌లోనే హెచ్చరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల పాటు నిద్రపోయిందని దాసోజు శ్రవణ్ విమర్శించారు. వర్షకాలం ముగిసి పంటలు ఎండిపోయాక జీవో నెం.1523 ద్వారా కేబినెట్ సబ్‌ కమిటీని వేయడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. కేసీఆర్‌పై రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేస్తూ 1,000 టీఎంసీలకు పైగా ప్రాణహిత వరద నీటిని సముద్రం పాలు చేశారని ఆరోపించారు. విద్యుత్ డిమాండ్‌ను సరిగ్గా అంచనా వేయలేక రోజుకు రూ. 42.92 కోట్ల ప్రజాధనాన్ని అధిక రేట్లకు కొనుగోలు చేస్తూ తగలేశారని అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, సబ్ కమిటీ సభ్యులకు బహిరంగ లేఖను రాశారు. అందులో 23 సూటి ప్రశ్నలను సంధించారు.

జీవో నెం. 1523లో నివేదిక సమర్పించడానికి ఎటువంటి గడువు గానీ, కరవు సహాయక చర్యల కోసం బడ్జెట్ గానీ కేటాయించలేదని, జలాశయాలు అడుగంటి తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న తరుణంలో జిల్లాలకు కేవలం రూ. 1 కోటి కేటాయించడం సిగ్గుచేటని శ్రవణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వం ముందు ఐదు కీలక డిమాండ్లను ఉంచారు. సబ్-కమిటీకి 15 రోజుల గడువు విధించి తగిన నిధులు సమకూర్చాలని, కరవు పరిస్థితులపై చర్చించేందుకు వెంటనే ఉభయ సభల ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి రూ. 20,000 కోట్ల అత్యవసర సప్లిమెంటరీ బడ్జెట్‌ను ఆమోదించాలని కోరారు. అలాగే కరవు ఖర్చులు, నీటి వృథా, విద్యుత్ కొనుగోళ్లపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు, పంట నష్టపోయిన ప్రతి రైతుకూ, కౌలు రైతులకూ తక్షణమే ఎకరాలవారీగా పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Dasoju Sravan Letter1

Dasoju Sravan Letter1

Dasoju Sravan Letter2

Dasoju Sravan Letter2

Dasoju Sravan Letter3

Dasoju Sravan Letter3

Dasoju Sravan Letter4

Dasoju Sravan Letter4

Dasoju Sravan Letter5

Dasoju Sravan Letter5

Comments (0)

User