Aawara Movie | మళ్లీ థియేటర్లలోకి కార్తీ కల్ట్ క్లాసిక్ ‘ఆవారా’.. గ్రాండ్ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!

30 October 2026 - 14:28
0 0
Aawara Movie | మళ్లీ థియేటర్లలోకి కార్తీ కల్ట్ క్లాసిక్ ‘ఆవారా’.. గ్రాండ్ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!
Aawara

Aawara | టాలీవుడ్ మరియు కోలీవుడ్‌లో ఎప్పటికీ మర్చిపోలేని కల్ట్ క్లాసిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆవారా’. హీరో కార్తీ (Karthi), తమన్నా (Tamannaah) జంటగా, లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. అయితే అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు సరికొత్త హంగులతో మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ‘ఆవారా 4K’ (Aawara 4K) వెర్షన్‌లో డిసెంబర్ 3న గ్రాండ్‌గా రీ-రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కేదార్ ఫిల్మ్స్ (Kedar Films) రిలీజ్ చేస్తున్న ఈ సినిమాని బిగ్ స్క్రీన్‌పై మరోసారి చూసేందుకు కార్తీ అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో మరోసారి యువన్ మ్యూజిక్ మానియా, కార్తీ-తమన్నా కెమిస్ట్రీని ఎంజాయ్ చేయడానికి రంగం సిద్ధమైంది!

Comments (0)

User