భారత మిస్సైల్‌ టెక్నాలజీని ఆపలేకపోతే చైనా, అమెరికాకు సైతం యుద్ధంలో ఓటమి

Aug 26, 2025 - 11:07
Aug 26, 2025 - 11:07
 0  2
భారత మిస్సైల్‌ టెక్నాలజీని ఆపలేకపోతే చైనా, అమెరికాకు సైతం యుద్ధంలో ఓటమి

నాగాస్త్రం.. పౌరాణిక సినిమాల్లోనే విని ఉంటాం. ఓ ఐదు రోజుల క్రితం DRDO అగ్ని-5 ప్రయోగించింది. జనరల్‌గా బాలిస్టిక్‌ మిస్సైల్‌ గీత గీసినట్టు స్ట్రైయిట్‌గా వెళ్తుంది. కాని, అగ్ని-5 పాము వెళ్లినట్టు జిగ్‌జాగ్‌గా వెళ్లింది. అంటే.. ఒక నాగాస్త్రంలా. ఆ వీడియో చూసి అగ్ని-5 లక్ష్యాన్ని ఛేదించలేకపోయిందని రాసుకొచ్చింది పాక్‌ మీడియా.

బట్.. శత్రువుల మిస్సైల్స్‌, రాడార్‌కు అందకుండా DRDO వాడిన టెక్నాలజీ అది. ఆమాత్రం బ్రెయిన్ వాడలేకపోయింది పాక్. అగ్ని మిస్సైల్స్‌పై పాక్‌ ఏడుపు ఎలాంటిదంటే.. భారత మిస్సైల్‌ టెక్నాలజీని ఆపలేకపోతే చైనా, అమెరికాకు సైతం యుద్ధంలో ఓటమి తప్పదని రాసింది.

చైనాను కాదని భారత్‌పైనే అమెరికా టారిఫ్స్‌ ఎందుకంటే.. ఇదిగో ఇలా ఇందుకే అని ఒక థియరీ ఉంది. సరే.. ఇంతకీ ఈ ప్రస్తావన ఎందుకు? మొన్న శనివారం.. ఇంటిగ్రేటెడ్ ఎయిర్‌డిఫెన్స్‌ వెపన్‌ సిస్టమ్‌ పరీక్ష విజయవంతం అయింది. S-400పైనే ఆధారపడకుండా సొంతంగా తయారుచేసుకుంటున్న శత్రు దుర్భేద్య కవచం అది.

ఈ మంగళవారం.. శత్రువులు కళ్లు తెరిచేలోపే అటాక్‌ చేసి వచ్చేసే ఫ్రిగేటర్స్‌ను దింపుతోంది ఇండియన్‌ నేవీ. సుదర్శన చక్రం రాబోతోంది అని ఆగస్ట్‌ 15న ఎర్రకోట వేదికగా మోదీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ నిజమవుతోంది. గత వారం రోజులుగా భారత రక్షణరంగం సాధిస్తున్న విజయాలు శత్రువులకు నిద్రలేకుండా చేస్తున్నాయ్.