నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

బూర్గంపహాడ్, అక్టోబర్ 19 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి పూర్వ విద్యార్థులు సోమవారం పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 1981- 82 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులతో పాటు 1991 వరకు ఉన్న 9 బ్యాచ్‌లు మొత్తం 10 బ్యాచ్‌లకు చెందిన పదో తరగతి విద్యార్థులు అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన సుమారు 300 మంది ఒకేచోట చేరి తమ బాల్య స్మృతులను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పి తమ ఉన్నతికి కారణమైన అప్పటి గురువులను ఘనంగా సత్కరించారు. అందరూ కలిసి ఆటపాటలతో సరదాగా గడిపారు.

నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Comments (0)