కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం

– ఈ 10న జీఎం కార్యాలయం ఎదుట అఖిలపక్ష జేఏసీ మహాధర్నా
రుద్రంపూర్, నవంబర్ 07 : కార్మికుల శ్రమతో సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో వారికి న్యాయంగా దక్కాల్సిన బోనస్ చెల్లింపుల విషయంలో యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ కొత్తగూడెం ఏరియాలోని వీకేసీఎం వద్ద అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కార్మికులకు రావాల్సిన బోనస్ విషయంలో యాజమాన్యం జాప్యం చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. కార్మికుల హక్కుల సాధన కోసం అన్ని సంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు జీఎం కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కార్మికులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గేట్ మీటింగ్‌లో అఖిలపక్ష జేఏసీ నాయకులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments (0)