Tiger Shroff | అస‌లు న‌న్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావ‌ట్లేదు : టైగర్‌ ష్రాఫ్‌

19 October 2026 - 22:15
0 0
Tiger Shroff | అస‌లు న‌న్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావ‌ట్లేదు : టైగర్‌ ష్రాఫ్‌
Tiger Shroff

Tiger Shroff : బాలీవుడ్‌ నటుడు (Bollywood Actor) టైగర్‌ ష్రాఫ్‌ (Tiger Shroff) పై కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే తనను ఎందుకు టార్గెట్‌ చేశారో అర్థం కావడంలేదని, గతంలో తనకు ఎలాంటి బెదిరింపులు కూడా రాలేదని, ఎవరితోనూ త‌న‌కు శత్రుత్వం లేదని టైగ‌ర్ ష్రాఫ్.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే (Eknath Shinde) తో టైగర్‌ ష్రాఫ్‌ చెప్పినట్లు సమాచారం. షిండేతో సమావేశమైన సమయంలో టైగ‌ర్ ష్రాఫ్ పైవిధంగా వెల్లడించినట్లు జాతీయ మీడియా (National Media) పేర్కొన్న‌ది.

సాధారణంగా వారాంతాల్లో ఫుట్‌బాల్‌ ఆడిన తర్వాత అభిమానులతో టైగర్‌ ష్రాఫ్‌ ఫొటోలు దిగుతుంటారు. ఆదివారం అలసటగా అనిపించడంతో అభిమానులతో ఫొటోలు దిగలేదట. ఈ నిర్ణయం తనను ప్రమాదం నుంచి తప్పించిందని శిండేతో చెప్పినట్లు సమాచారం. అలాగే లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌, నటుడు సల్మాన్‌ ఖాన్‌కు సంబంధించిన వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో తెలియడం లేదని టైగర్‌ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఇదిలావుంటే కాల్పుల అనంతరం ఆదివారం రాత్రి టైగర్‌ ష్రాఫ్‌ను పరామర్శించిన ఏక్‌నాథ్‌ శిండే ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆయ‌న‌కు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడంతోపాటు, ఆయన నివాసం వద్ద పోలీసు భద్రతను పెంచే చర్యలు చేపట్టనున్న‌ట్లు షిండే చెప్పార‌ని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులకు పాల్పడిన నిందితులను రాజస్థాన్‌ పోలీసులు పకడ్బందీగా అదుపులోకి తీసుకున్నారు.

Comments (0)

User