Prasidh Krishna: కివీస్‌తో వ‌న్డేల‌కు ప్ర‌సిద్ధ కృష్ణ దూరం.. ఇండియా-ఏ జ‌ట్టులోకి సిరాజ్

30 October 2026 - 14:28
0 0
Prasidh Krishna: కివీస్‌తో వ‌న్డేల‌కు ప్ర‌సిద్ధ కృష్ణ దూరం.. ఇండియా-ఏ జ‌ట్టులోకి సిరాజ్
Prasidhsiraj

వెల్లింగ్ట‌న్: ఇండియా, ఇండియా-ఏ జ‌ట్లు ప్ర‌స్తుతం న్యూజిలాండ్‌లో టూరు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే కివీస్‌తో జ‌రిగే అయిదు వన్డేల‌కు పేస్ బౌల‌ర్ ప్ర‌సిద్ధ కృష్ణ దూరం కానున్నాడు. ఇంకా అత‌ను ఫిట్‌కాని కార‌ణంగా వ‌న్డేల‌కు ప‌క్క‌న‌పెట్టారు. తొడ‌కండ‌రాల గాయం నుంచి అత‌ను కోలుకుంటున్నాడు. ప్ర‌సిద్ధ కృష్ణ కోలుకోవ‌డానికి ఇంకా స‌మ‌యం ప‌డుతుంద‌ని బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అయితే న్యూజిలాండ్‌-ఏ జ‌ట్టుతో జ‌రిగే మూడ‌వ‌, నాలుగ‌వ మ్యాచ్‌ల‌కు ఇండియాఏ జ‌ట్టుతో ప్ర‌సిద్ధ కృష్ణ క‌లుస్తాడ‌ని బీసీసీఐ చెప్పింది. అది కూడా అత‌ను ఫిట్ అయితేనే అని పేర్కొన్న‌ది. ఒక‌వేళ ఏ జ‌ట్టుతో అత‌ను ఆడితే, అత‌నికి టెస్టు సిరీస్ ముందు అత‌నికి ప్రాక్టీస్ అవుతుంది.

అక్టోబ‌ర్ 31 నుంచి న్యూజిలాండ్‌-ఏతో జ‌రిగే రెండో మ్యాచ్ కోసం సిరాజ్ భార‌త్-ఏ జ‌ట్టుతో జ‌త‌కూడ‌నున్నాడు. ఇక నితీశ్ కుమార్ రెడ్డి కివీస్‌తో జ‌రిగే తొలి వ‌న్డేకు అందుబాటులో ఉంటాడు. ఆ త‌ర్వాత అత‌ను ఇండియా ఏ జ‌ట్టుతో జ‌రిగే మూడో, నాలుగు మ్యాచ్‌లో ఆడుతాడు. న‌వంబ‌ర్ 19 నుంచి కివీస్‌తో జ‌రిగే రెండు టెస్టుల సిరీస్‌కు నితీశ్ రెడ్డికి ప్రిప‌రేష‌న్ కానున్న‌ది.

తొలి మూడు వ‌న్డేలు భార‌త జ‌ట్టు : గిల్‌(కెప్టెన్‌), రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ, అయ్య‌ర్‌, కేఎల్ రాహుల్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, న‌మ‌న్ ధీర్‌, అన్షుల్ కాంబోజ్‌, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్‌, అర్ష‌దీప్ సింగ్, ఇషాన్ కిష‌న్‌, సిరాజ్‌, కుల్దీప్‌, నితీశ్‌.

నాలుగో, అయిదో వ‌న్డేల‌కు జ‌ట్టు: అయ్య‌ర్(కెప్టెన్), రోహిత్‌, కోహ్లీ, తిల‌క్ వ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, న‌మ‌న్ ధీర్‌, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్‌, రుతురాజ్ గైక్వాడ్‌, అర్ష‌దీప్ సింగ్‌, కుమార్ కుషాగ్రా, సిరాజ్‌, య‌శ్ థాకూర్‌, కుల్దీప్ యాద‌వ్‌.

Comments (0)

User