Polling Officer | ఎన్నికల విధుల్లో విషాదం.. గుండెపోటుతో పోలింగ్‌ అధికారి మృతి

5 November 2026 - 18:00
0 0
Polling Officer | ఎన్నికల విధుల్లో విషాదం.. గుండెపోటుతో పోలింగ్‌ అధికారి మృతి
Sucide

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌( Andhra Pradesh )లో జరుగుతున్న ఎంపీటీసీ ( MPTC ), జడ్పీటీసీ ( ZPTC ) ఎన్నికల్లో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలింగ్‌ అధికారి గుండెపోటుతో మృతి చెందారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం కాడదారకుంటలో ఏపీవో ( Polling Officer ) గా విధులు నిర్వహిస్తున్న హరిత గౌడ్‌ ( Haritha Goud ) కు గుండెపోటు గురయ్యారు.

దీంతో అతడిని కూడేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందారు. రాయదుర్గం మండలంలో టీచర్‌గా పనిచేస్తున్న హరితగౌడ్‌కు ఎన్నికల బాధ్యతలు అప్పగించగా గురువారం ఎన్నికల డ్యూటీలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీలో 582 జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది , 7,767 ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

Comments (0)

User