Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..

Medicover Hospitals | సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రిలో మరణాలపై ప్రశ్నించిన జర్నలిస్ట్ శంకర్ గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మల్కాజిగిరి జిల్లా పరిధిలోని గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నంబర్ 269/2026 నమోదైంది. 2026 అక్టోబర్ 16న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బీఎన్‌ఎస్ లోని 126(2), 115(2), 351(2), 329, 324, 352 సెక్షన్లతో పాటు 3(5) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
జర్నలిస్ట్ శంకర్ గౌడ్‌తో పాటు మరో మహిళ పేరును కూడా నిందితుల వివరాల విభాగంలో నమోదు చేశారు. దీనిపై జర్నలిస్టులు, ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. జర్నలిస్టు గొంతు నొక్కే ప్రయత్నమా? ఫిర్యాదులోని ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మెడికవర్ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, ఖమ్మంలో 2024లో నమోదైన మరో కేసుకు సంబంధించి కూడా జర్నలిస్ట్ శంకర్‌ను విచారణకు పిలిచినట్లు సమాచారం.
Comments (0)