Hyderabad | హైదరాబాద్‌ పవర్‌ గ్రిడ్‌ కార్యాలయంలో షాక్‌.. మహిళల వాష్‌రూమ్‌లో సీక్రెట్‌ ఫోన్‌!

25 October 2026 - 08:44
0 0
Hyderabad | హైదరాబాద్‌ పవర్‌ గ్రిడ్‌ కార్యాలయంలో షాక్‌.. మహిళల వాష్‌రూమ్‌లో సీక్రెట్‌ ఫోన్‌!
Washroom Camera

Hyderabad | సిటీబ్యూరో, అక్టోబర్ 24(నమస్తే తెలం గాణ): హైదరాబాద్ కవాడిగూడలోని పవర్డ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆఫీసు లోని మహిళల వాష్రూమ్లో రహస్యంగా సీక్రెట్ కెమెరాను అమర్చి.. వీడియోలు చిత్రీకరించాడు ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి. ఓ మహిళ ఉద్యోగి అప్రమత్తతో విషయం బట్టబయలు అయింది. నిందితుడిని గాంధీనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండు తర లించారు.

కవాడిగూడలోని పవర్ గ్రిడ్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగి భరత్.. మహిళలు ఉపయోగించే వాష్రూమ్స్ వాష్ బేసిన్ కింద కాగితానికి రంధ్రాలు చేసి, డబుల్సైడ్ టేపుతో సెల్ఫోన్ను అమ ర్చాడు. అక్టోబర్ 13న ఓ మహిళా ఉన్నతా ధికారిణి అనుమానాస్పదంగా ఉన్న ఆ ఫోన్ ను గుర్తించి ఆశ్చర్యపోయారు. ఈ ఫోన్ ఎవరిదంటూ ఆఫీసులో ఆమె గట్టిగా నిలదీ యడంతో, ఫ్లోర్ అటెండర్ భరత్ ఆ ఫోన్ ను ఆమె చేతిలోంచి లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు.

బాధితురాలి కేక లతో వెంటనే అప్రమత్తమైన సహోద్యో గులు, భద్రతా సిబ్బంది భరత్ను పట్టుకు న్నారు. ఆ తర్వాత ఫోన్లోని వీడియోలను పరిశీలించేందుకు ప్రయత్నించగా, ప్రైవేటు ఫోల్డర్కు పిన్లాక్ పెట్టి ఉన్నట్లు గుర్తించారు. ఆ ఫోల్డర్ ఓపెన్ చేయమని నిలదీయడంతో దొరికిపోయానని భయపడిన భరత్.. ఫోన్ను నేలకేసి కొట్టి సాక్ష్యాలను ఎవరికీ చిక్కకుండా ధ్వంసం చేశాడు.

ఈనెల 19న బాధితురాలి ఫిర్యాదుతో గాంధీనగర్ పోలీ సులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. మహిళలకు సంబంధించి సున్నితమైన కేసు కావడంతో పాటు లోతుగా దర్యాప్తు చేసే క్రమంలో ఫోన్ డేటాను క్రాక్ చేసి ధ్వంసమైన ఫోన్ నుంచి సమాచారాన్ని వెలికితీసేందుకు కేసును సైబర్ క్రైమ్క బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐటీయాక్ట్ 66ఈ, బీఎన్ఎస్ 77,238 సెక్షన్ల కింద రిజిస్టర్ చేసిన పోలీ సులు ఈ వికృత చేష్టల వెనక ఎవరైనా ఉన్నారా.. గతంలో ఏమైనా స్పై కెమెరాలు పెట్టారా అనే కోణంలో లోతైన విచారణ చేప ట్టారు. కవాడిగూడ పవర్ గ్రిడ్ ఆఫీసులో జరిగిన ఈ ఘటనతో పనిచేసేచోట మహి శలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీ సులు సూచిస్తున్నారు.

Comments (0)

User