El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!

El Nino | తెలంగాణ రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావాన్ని సమీక్షించి, వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలపై సిఫార్సులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఈ మంత్రివర్గ ఉపసంఘానికి డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి ఈ సబ్‌కమిటీలో సభ్యులుగా ఉండన్నారు.
ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావును ఈ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. ఆయన సబ్‌కమిటీ సమన్వయ బాధ్యతలు నిర్వహించడంతోపాటు, కమిటీ తీసుకునే నిర్ణయాలు, సిఫార్సులపై ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు సమాచారం అందించనున్నారు. ప్రణాళిక శాఖ కార్యదర్శి కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

El Nino Drought1
Comments (0)