ACB Raid | ఏసీబీ వలలో జలమండలి ఉన్నతాధికారి.. రూ. 10 లక్షలు లంచం తీసుకుని వెళ్తుండగా అదుపులోకి?

ACB Raid | సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): జలమండలిలోని ఓ కీలక విభాగానికి చెందిన ఉన్నతాధికారి ఏసీబీ వలలో చిక్కినట్లు ప్రస్తుతం జలమండలి వర్గాల్లో విస్తృతచర్చ జరుగుతోంది. శనివారం సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో జలమండలి నుంచి తన వాహ నంలో బయలుదేరిన ఆ అధికారిని వెంబడించిన పోలీసు స్టిక్కర్‌తో ఉన్న వాహనంతో పాటు మరొక వాహనంలో ఆరుగురు వ్యక్తులు సోమాజిగూడ రాజభవన్ రోడ్డులో ఆయన వాహనాన్ని అడ్డగించారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్‌పంపు ఎదురుగా రోడ్డు పక్కన ఆ అధికారిని సుమారుగా మూడు గంటల పాటు నిలబెట్టి విచారించి నట్లు సమాచారం.
జలమండలి కార్యాలయంలో సాయంత్రం ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.10 లక్షల రూపాయలు తీసుకున్నట్లుగా వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ అధికారులే జలమం డలి అధికారిని అదుపులోకి తీసుకున్నారంటూ వాటర్ బోర్డు వర్గాలు చెప్పుకొంటున్నాయి. అధికారి కారులో ఉన్న బ్యాగు నుంచి కొంత డబ్బును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని రోడ్డుపైనే పంచ నామా నిర్వహించినట్లు సమాచారం. ఈమేరకు ఆ బ్యాగులో ఎంత డబ్బులు ఉన్నాయనేది ఆ అధికారులు వెల్లడించేవరకు బయటపడే అవకాశం లేదని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.50 గంటల పాటు విచారించిన సమయంలో ఆ అధికారి ఏమీ మాట్లాడకుండా చేతులు కట్టుకుని నిలుచోవడం, కొంతసేపటి తర్వాత కారులోకి వెళ్లి తన వెంట తెచ్చిన వస్తువులను చూపించడం, మరోసారి కారు దగ్గ రకు ఒక అధికారితో వెళ్లి అందులో ఉన్న సామగ్రిని చూపించడం వంటివి చేసినట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ వ్యవహారంలో ఏసీబీ అధికారులుగా భావిస్తున్న పోలీసులు జలమండలి ఉన్నతాధికారిపై ఎటువంటి కేసు నమోదు చేస్తారనే అంశంపై జలమండలిలో ఉన్నతాధికారి నుంచి అటెం డర్ వరకు ప్రతీ ఒక్కరూ రాత్రంతా ఫోన్లలోనే చర్చిస్తూ, కొందరు విలేక రులను ఏమైనా తెలిసిందా అంటూ పదే పదే ఆరా తీయడంతో ఈ వ్యవ హారం ఆద్యంతం ఉత్కంఠ రేపుతోంది. అయితే సాధారణంగా ఏసీబీ అధి కారులు ట్రాప్ చేసిన రెండు మూడుగంటల తర్వాత విచారణకు సంబం ధించిన ప్రాథమిక సమాచారం ఇవ్వడం జరుగుతుంది. కానీ జలమం డలి ఉన్నతాధికారి విషయంలో విచారణ కొనసాగిన తీరు, ఆ తర్వాత అతనిని తమ వాహనంలో తీసుకుపోయిన విధానంపై ఇది అక్రమాస్తులు లేదా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుగా మారుతుందా.. లేక ఆ అధి కారికి సంబంధించిన ఆస్తులపై దాడులు జరిగే అవకాశముందా అనే దిశగా జలమండలి మొత్తం చర్చిస్తున్నారు.
ఇదే సమయంలో నిత్యం రద్దీగా ఉండే రాజభవన్ రోడ్డు పక్కన పోలీసు స్టిక్కరుతో ఉన్న ఓ కారుతో పాటు మరో రెండు కార్లు గంటల కొద్దీ ఆగి ఉన్నా ఎవరూ పట్టించుకో కుండా పోగా.. మూడు గంటల పాటు రద్దీగా ఉండే రోడ్డు పక్కన ఇంత హైడ్రామా జరుగుతున్నా ఏ ఒక్క మీడియా సంస్థకు సమాచారం తెలియ కపోవడంపై జలమండలితో పాటు ఆ అధికారి గతంలో చేసిన సంస్థకు సంబంధించిన కొందరు అధికారులు కూడా అసలు ఏం జరుగుతుందో నంటూ చెవులు కొరుక్కుంటున్నారు.
Comments (0)