‘ఈ 15 నుండి ఆశా కార్య‌క‌ర్త‌ల‌ నిరవధిక సమ్మె’

3 November 2026 - 19:28
0 0
‘ఈ 15 నుండి ఆశా కార్య‌క‌ర్త‌ల‌ నిరవధిక సమ్మె’
'ఈ 15 నుండి ఆశా కార్య‌క‌ర్త‌ల‌ నిరవధిక సమ్మె'

– సీఐటీయూ భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కోశాధికారి పద్మ
– రూ.18 వేల వేతనం, పీఎఫ్‌, ఈఎస్ఐతో ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాలని డిమాండ్‌

బూర్గంపహాడ్, నవంబర్ 03 : ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు నిరవధిక సమ్మె చేపడుతున్న‌ట్లు సీఐటీయూ భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కోశాధికారి పద్మ తెలిపారు. ఈ మేరకు మంగళవారం బూర్గంపహాడ్ మెడికల్ ఆఫీసర్‌కు ఆశాలతో సీఐటీయూ నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా ఆశాల వేతనాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పారితోషికం పేరుతో ఆశాల శ్రమను ప్రభుత్వం దోపిడీ చేస్తుందని విమర్శించారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆశాలు ముందుండి విశేష సేవలందించారని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వారికి కనీస వేతనం అమలుచేయడానికి ముందుకు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా జిల్లా కమిటీ సభ్యులు తారాదేవి, బుచ్చమ్మ, నాగమణి, బాయమ్మ, రత్నకుమారి, నాగేశ్వరి, పద్మ, సుగుణలక్ష్మి, రాధ, తిరుపతమ్మ, సీత పాల్గొన్నారు.

Comments (0)

User