Namaste Effect | నిబంధనలకు విరుద్ధంగా పటాకుల స్టాల్స్ ఏర్పాటు పై చర్యలు

సుబేదారి, నవంబర్ 05: హనుమకొండ బాలసముద్రం హయగ్రీవచారి మైదానంలో దీపావళి పటాకులు స్టాల్స్ నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు ఇవ్వకముందే షాప్ లు ఏర్పాటు చేయడంతో ఫైర్ అధికారులు గురువారం చర్యలు చేపట్టారు .గ్రౌండ్ కెపాసిటీ 78 స్టాల్స్, కానీ ప్రైవేట్ కమిటీ గుత్తాధిపత్యంతో నిబంధనలకు విరుద్ధంగా వందకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీనిపై నమస్తే తెలంగాణలో వరుస కథనాలు ప్రచురించడంతో అధికారులు స్పందించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు ఫైర్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తొలగించారు. 75 షాపులు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి, షాప్ షాప్ మధ్య కనీసం మూడు మీటర్ల దూరం నిబంధన పాటించాలని షాప్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇక్కడ దీపావళి దుకాణాల షాపులకు ఎవరికి అనుమతులు ఇవ్వలేదని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పడం గమనార్హం.
Comments (0)