Former Minister Talasani | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ను వెంటనే విడుదల చేయాలి : మాజీ మంత్రి తలసాని

హైదరాబాద్ : బీఆర్‌ఎస్ నాయకుడు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ( Balraj Yadav ) ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలు నిరాధారమైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ప్రశ్నించిన బాలరాజ్ యాదవ్ ను అరెస్ట్ చేయడం అక్రమమని తెలిపారు.
ప్రజాస్వామ్య బద్దంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో తప్పుడు ఆరోపణలను ప్రశ్నించడం, ఖండించడం నేరమా? అని ప్రశ్నించారు. వెంటనే దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments (0)