బల్మూరికి బడితెపూజ ఖాయం

28 October 2026 - 09:32
0 0
బల్మూరికి బడితెపూజ ఖాయం
01
  • పాలనపై నిలదీస్తే వ్యక్తిగత దూషణలా?
  • సమస్యలపై నిలదీస్తే రోత మాటలా?
  • కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బాలరాజ్‌
  • మహిళా లోకానికి  క్షమాపణ చెప్పాలి
  • టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు  సుమిత్రానంద్‌ డిమాండ్‌ 

హైదరాబాద్‌, అక్టోబర్‌ 27 (నమస్తే తెలంగాణ) : కేటీఆర్‌పై స్థాయి మరచి విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బడితెపూజ చేస్తారని కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ దూదిమెట్ల బాలరాజ్‌ హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాసమస్యలపై దృష్టిసారించాల్సిన కాంగ్రెస్‌ నేతలు, పాలనపై నిలదీసి నందుకు ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజల కోసం కాకుండా, కేవలం తిట్ల కోసమే అన్నట్టుగా పాలన సాగిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రజలకు మంచినీళ్లు, కరెంట్‌, రైతుల సమస్యలపై నిలదీస్తే సమాధానం చెప్పలేక, సబ్జెక్టు చేతకాక రోత భాషతో చౌకబారు విమర్శలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని, కన్నెపల్లి నుంచి మేడిగడ్డకు నీళ్లు లిఫ్ట్‌ చేస్తామంటూ అర్థంపర్థం లేని మాటలతో నవ్వులపాలవుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత తెలంగాణ జలాలను ఏపీకి దోచిపెట్టడం మొదలైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలపై ప్రశ్నిస్తే.. వ్యక్తిగత దూషణలకు దిగడం వారి దిగజారు డుతనానికి నిదర్శనమని అన్నారు. గోవా క్లబ్బుల్లో బల్మూరి వెంకట్‌ చేసిన అనైతిక పనుల చిట్టా తమ వద్ద ఉన్నదని చెప్పారు.

మహిళలకు క్షమాపణ చెప్పాలి : సుమిత్రానంద్‌

బల్మూరి వెంకట్‌ మహిళలను కించపరిచే లా మాట్లాడటం సిగ్గుచేటని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్‌ నిప్పులు చెరిగారు. ఆడబిడ్డల జీవితాల గురించి సంస్కారం లేకుండా మాట్లాడటం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రేవంత్‌రెడ్డి నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చాడని ఆయన పెంపుడు కుక్క లాగా బల్మూరి బరితెగించి మాట్లాడటం తగదు’ అని నిప్పులు చెరిగారు. చిల్లర రాజకీయాల కోసం సినిమా నటీమణుల పేర్లను వివాదాల్లోకి లాగడం కాంగ్రెస్‌ నాయకుల చౌకబారుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు బల్మూరి వెంకట్‌ వెంటనే మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ నేతలు బానోత్‌ ర వికుమార్‌, భూక్యా రవినాయక్‌ పాల్గొన్నారు.

Comments (0)

User