తెలంగాణలో మరో 4 రోజులు భారీ వర్షాలు..! ఈ ప్రాంతాలకు 'ఎల్లో' హెచ్చరికలు
తెలంగాణలో కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో 4 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది.
