Janasena Leaders File Nominations : జనసేన నేతలు భారీగా నామినేషన్లు!

19 October 2026 - 22:14
0 0
Janasena Leaders File Nominations : జనసేన నేతలు భారీగా నామినేషన్లు!
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. నంద్యాల జిల్లాలోని 11 మున్సిపల్ వార్డుల్లో జనసేన పార్టీ నాయకులు, అభ్యర్థులు శ్రేణులతో కలిసి ఘనంగా నామినేషన్లు దాఖలు చేశారు. తమ మద్దతుదారులతో కలిసి భారీ ప్రదర్శనగా తరలివెళ్లి రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. కూటమి పొత్తులో భాగంగా వార్డుల్లో భారీ విజయభేరి మోగిస్తామని ఈ సందర్భంగా జనసేన నేతలు ధీమా వ్యక్తం చేశారు.

Comments (0)

User